







మాగురించి
తెలుగు జాతి గొప్పతనాన్ని, తెలుగు భాష వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ కృష్ణదేవరాయలు “దేశ భాషలందు తెలుగు లెస్స” అని ప్రకటించారు. అలాంటి తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణ లక్ష్యంగా 1952లో బెంగళూరులో తెలుగు విజ్ఞాన సమితి స్థాపించబడింది.
తెన్నేటి విశ్వనాధం గారు, దివాన్ న్యాపతి మాధవరావు పంతులు గారు వంటి మహనీయుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ సమితి, నేటికీ విద్యా, సాహిత్య, సాంస్కృతిక సేవలను కొనసాగిస్తోంది.
తిరుమల విద్యానికేతన్ పాఠశాల, శ్రీ తెన్నేటి విశ్వనాధం స్మారక గ్రంథాలయం, శ్రీ కృష్ణదేవరాయ కళామందిరం ద్వారా తెలుగు సంస్కృతిని పరిరక్షిస్తూ, ప్రతి సంవత్సరం సాంస్కృతిక ఉత్సవాలు, పురస్కార కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అంతేకాక ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ కార్యక్రమాలు చేపడుతూ సంఘసేవలోనూ ముందుంటోంది.
తెలుగు భాషా, సంస్కృతుల అభివృద్ధికి కృషి చేసిన సమితి మహనీయులందరికీ మన వందనాలు.
జై తెలుగు తల్లి, జై కర్ణాటక, జై హింద్




వ్యవస్థాపక సభ్యులు





















అభినందనలు








ఆర్కైవ్స్























